మాజీ సైనికుల సంక్షేమ నిధికి రూ.లక్ష విరాళం
మాజీ సైనికుల సంక్షేమం కోసం రూ.లక్ష చెక్కును కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ బి. రామారావు జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ కు సోమవారం అందజేశారు.
దిశ ప్రతినిధి,విశాఖపట్నం:మాజీ సైనికుల సంక్షేమం కోసం రూ.లక్ష చెక్కును కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ బి. రామారావు జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ కు సోమవారం అందజేశారు. కలెక్టర్ కార్యాలయ వీడియో సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ సిబ్బంది తరపున రూ.లక్ష విరాళాన్ని అందజేస్తున్నట్లు బ్రాంచ్ మేనేజర్ జేసీకి తెలియజేశారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున మాజీ సైనికుల సంక్షేమం కోసం విరాళాలు అందజేయాలని పిలుపునిచ్చిన సంగతి విదితమే. అందులో భాగంగా తమ వంతుగా లక్ష రూపాయల విరాళాన్ని అందించామని జేసీకి బ్రాంచ్ మేనేజర్ వివరించారు.కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి జి. సత్యానందం, జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.