వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించండి-సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ ను ఓడించండని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ పిలుపు ఇచ్చారు.
దిశ ప్రతినిధి,విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ ను ఓడించండని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ పిలుపు ఇచ్చారు. ఆయన విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 12,918 గ్రామాల్లో గల3.50 కోట్ల ప్రజలు కోసం ఢిల్లీ వరకు ఉద్యమం చేస్తున్నాము అని గుర్తు చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడడం లేదు.16 న్యాయమైన డిమాండ్ల సాధనకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాలు వద్ద నిరసన చేస్తున్నాము. అన్ని రాజకీయ పార్టీల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ల ద్వారా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఓటమి కోసం పిలుపు ఇచ్చాం. వైసీపీ ఓటమి తోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుంది.ఎన్ని పోరాటాలు చేసినా సర్కారు స్పందించడం లేదు. ఇంటింటి ప్రచారం చేసి జగన్ చేసిన అన్యాయం వివరిస్తాము. కేంద్రం ఇచ్చిన 6,848 కోట్ల నిధులు దారి మళ్లించారు. ఉపాధి హామీ నిధులు కూడా పక్క దారి పట్టించి ప్రజలకు ఆన్యాయం చేశారు. వైసీపీ ప్రభుత్వం సుమారుగా 50 వేల కోట్ల నిధులు ఇవ్వకుండా స్వంత పథకాలకు వినియోగించారు. నవ రత్నాల లో రెండు రత్నాలకు గ్రామాల నిధులు మళ్లించారు. గ్రామంలో తాగునీరు, సాగునీరు, కాలువలు, రోడ్లు, వీధి లైట్లు వేయడం లేదు. సర్పంచులకి గౌరవ వేతనం ముస్టి మూడు వేలు ఇస్తున్నారు.
వాలంటీర్లకు రూ.ఐదు వేల వేతనం ఇస్తున్నారు. సర్పంచులు దమ్మీలు అవ్వడం వైసీపీ సర్కారు యోచన. మూడో రాజధాని విశాఖ అంటున్నారు. సర్పంచులు, వాలంటీర్స్ ఎవరు కావాలో జగన్ తేల్చుకోవాలి. నిధుల మళ్లింపు మీద హైకోర్టులో కేసు వేసిన హియరింగ్ రాకుండా కుట్ర చేస్తున్నారు. సీఎం జగన్ గద్దె దించడానికి తాము కూడా సిద్ధం అని పేర్కొన్నారు.రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు మాట్లాడుతూ, మూడేళ్లుగా ఉద్యమాలు నడుస్తున్నాయి రెండో దశ కింద అసెంబ్లీ ముట్టడి చేశాము. జిల్లా అధ్యక్షుడు ముత్యాలరావు మాట్లాడుతూ, రాజ్యాంగ, చట్ట బద్ద మైన పాలన చేయడం లేదు. గ్రామాలకు మూడేళ్లుగా గ్రాంట్లు ఇవ్వడం లేదు. వైసీపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ద్వారా సత్తా చూపిస్తాం అని హెచ్చరించారు.సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ రాజు మాట్లాడుతూ, ప్రభుత్వం పంచాయతీల మీద ఉక్కుపాదం మోపుతోంది. సర్పంచులు ఉత్సవ విగ్రహాలు మాదిరిగా తయారయ్యారు అని విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ నీ వైసీపీ సర్పంచులు కూడా ఓడిస్తారు అని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు అమ్మోరు పాల్గొన్నారు.