చిరుధాన్యాలతో పిచ్చుకల చిత్రం..క్రియేటివిటీ అదుర్స్!
పర్యావరణంలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంటుంది.మన ఇంటి ముందు సందడి చేస్తూ ఉదయాన్నే దర్శనమిచ్చే పిచ్చుకల జీవితం ఎంతో ప్రత్యేకం. ప్రస్తుత యుగంలో వీటి సంఖ్య నానాటికీ తగ్గిపోతుంది.
దిశ ప్రతినిధి,విశాఖపట్నం:పర్యావరణంలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంటుంది.మన ఇంటి ముందు సందడి చేస్తూ ఉదయాన్నే దర్శనమిచ్చే పిచ్చుకల జీవితం ఎంతో ప్రత్యేకం. ప్రస్తుత యుగంలో వీటి సంఖ్య నానాటికీ తగ్గిపోతుంది.నేడు అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం దీనిని పురస్కరించుకొని నగరానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ ఒక ప్రత్యేకమైన చిత్రాన్ని తీర్చిదిద్దారు.చిరుధాన్యాలు ఉపయోగించి ఒక 2డీ చిత్రాన్ని తీర్చిదిద్దారు.
ప్రజల్లో పిచ్చుకల పట్ల చిరుధాన్యాల పట్ల అవగాహన పెంపొందించడం ప్రధాన ఉద్దేశంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.మానవ మనుగడలో, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో పిచ్చుకల పాత్రను తెలుసుకోవాలని, అదేవిధంగా మానవుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, పరిరక్షించడంలో చిరుధాన్యాల భూమిక సైతం గుర్తించాలని తన చిత్రాల ద్వారా సందేశాన్ని విజయకుమార్ సమాజానికి అందిస్తున్నారు.నాలుగు రోజుల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దారు.18 ఇంచుల వెడల్పు 24 ఇంచుల పొడవుతో ఈ చిత్రాన్ని సహజత్వం ఉట్టిపడే విధంగా తయారు చేశారు.