మహిళా సాధికారతే చంద్రబాబు ధ్యేయం:గండి బాబ్జీ

మహిళా సాధికారతే చంద్రబాబు నాయుడు ధ్యేయం అని విశాఖ దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గండి బాబ్జీ అన్నారు.

Update: 2024-03-08 15:01 GMT

దిశ ప్రతనిధి, విశాఖపట్నం:మహిళా సాధికారతే చంద్రబాబు నాయుడు ధ్యేయం అని విశాఖ దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గండి బాబ్జీ అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గం తెలుగు మహిళ అధ్యక్షురాలు కేదారి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం ఇన్చార్జి గండి బాబ్జీ కేక్ కట్ చేసి కార్యక్రమం ప్రారంభించారు.

ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ మహిళా సాధికారతే చంద్రబాబు నాయుడు ధ్యేయం అని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని చంద్రబాబు అంటుంటారని అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మహిళలకు స్వయం ఉపాధి పథకాలను రూపొందించి అమలు చేసి తద్వారా మహిళా సాధికారకత కు చంద్రబాబు నాయుడు కృషి చేస్తారని అన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి గణ గళ్ళ సత్య మహిళా నాయకులు రామలక్ష్మి , గోవిందమ్మ , కుమారి , దేవి , భాగ్యలక్ష్మి , రాగిణి తదితర మహిళా నాయకులు పాల్గొన్నారు.


Similar News