రెండు కార్లు సీజ్..కారణం ఏంటంటే?
ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ ప్రకటించింది.ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి కొన్ని నియమ నిబంధనలు అమలు చేస్తున్నారు.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం:ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ ప్రకటించింది.ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి కొన్ని నియమ నిబంధనలు అమలు చేస్తున్నారు.పార్టీకి సంబంధించిన ఫొటోలు, బ్యానర్లు,ఫ్లెక్సీలు తొలగించాలని ఈసీ ఆదేశించింది. కానీ కొందరు వాటిని ఉల్లంఘించడం జరిగింది.తాజాగా రెండు కార్లలో వెళుతున్న ఇద్దరు వ్యక్తులను ఎలక్షన్ టీం ఫ్లయింగ్ స్క్వాడ్ గాజువాక ఇంచార్జ్ అధికారిని రేవతి గురువారం అదుపులోకి తీసుకున్నారు.అగనంపూడి టోల్ గేట్ సమీపంలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలో భాగంగా మంత్రి దాడిశెట్టి రాజాకు చెందిన రెండు కార్లపై వైసీపీ సిద్ధం స్టిక్కర్స్ ఉండటంతో అధికారులు సీజ్ చేశారు.