Visakha: కార్మిక సంఘం ఎన్నికల్లో AITUC విజయకేతనం

బి.హెచ్.ఈ.ఎల్, హెచ్.పి.వి.పి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి..

Update: 2023-08-31 16:54 GMT

దిశ , గాజువాక: బి.హెచ్.ఈ.ఎల్, హెచ్.పి.వి.పి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 445 కాగా , పోలైన ఓట్లు 441 , హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో బి.హెచ్.పి.వి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ( ఏ. ఐ.టి.యూ.సి) మిత్ర పక్షాల కూటమి విజయకేతనం ఎగుర వేసింది . ఎన్నికల్లో మూడు ప్యానెల్‌లు బరిలో నిలిచాయి. పోలింగ్ అనంతరం ఎన్నికల అధికారి , డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డి. శ్రీనివాసులు ఫలితాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో బి.హెచ్.పి వి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌కు 225, బి.హెచ్.పి.వి నేషనల్ ఎంప్లాయీస్ యూనియన్‌కు 197 , బి.హెచ్.ఈ.ఎల్ కార్మిక సంఘ్ కు 16 ఓట్లు రాగా 3 ఓట్లు చెల్లలేదని తెలిపారు.

ఇది కార్మిక విజయం: ఏ. ఐ. టి.యూ.సి.

బి.హెచ్.ఈ.ఎల్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఏ.ఐ.టి యూ.సి ఘనవిజయం సాధించిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఓబులేసు, జాతీయ ఉపాధ్యక్షులు డి. ఆదినారాయణ , రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ తెలిపారు . ఏ.ఇ.టి.యూ.సి మిత్ర పక్షాల కూటమిని ఓడించాలని సి. ఐ.టి.యూ. ఐ.ఎన్.టి.యూ.సి, వై.ఎస్‌ ఆర్ టి.యూ. సి కూటమిగా పోటీ చేసినప్పటికీ కార్మిక వర్గం ఏ.ఐ.టి.యూ.సి కూటమికే పట్టం కట్టిందన్నారు. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా అంతిమ విజయం ఏ. ఐ.టి. యూ.సినే వరించిందని చెప్పారు.


Similar News