AP SSC-టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి:డీఈఓ
ఈనెల 18 నుంచి 30 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు మొత్తం 31,379 మంది హాజరవుతారని జిల్లా విద్యా శాఖ అధికారి ఎల్.చంద్ర కళ చెప్పారు.
దిశ ప్రతినిధి, విశాఖ పట్నం:ఈనెల 18 నుంచి 30 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు మొత్తం 31,379 మంది హాజరవుతారని జిల్లా విద్యా శాఖ అధికారి ఎల్.చంద్ర కళ చెప్పారు. వీరిలో రెగ్యులర్ గా 28,367 మంది, ప్రైవేట్ గా 3012 మంది పరీకలకు దరఖాస్తు చేయగా, వీరిలో 13,395 మంది బాలికలు, 14,972 మంది బాలురు వున్నారని విలేకరులతో చెప్పారు.జిల్లాలో 138 కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్ని సదుపాయాలు కల్పించామని ఉచిత రవాణా కోసం ఆర్టీసీ బస్సులు లో హాల్ టికెట్ చూపించాలి అని సూచించారు.పరీక్షలకు హాజరయ్యే వారికి అర గంట గ్రీస్ పీరియడ్ వుంటుందని స్పష్టం చేశారు.
పరీక్ష పేపర్లు ఆరు నుంచి ఏడుకి పెరిగాయని ప్రశ్న పత్రం మీద క్యు ఆర్ కోడ్ ముద్రించి ఉంటుందని తెలిపారు. పరీక్షా కేంద్రాలను నో మొబైల్ జోన్ గా ప్రకటించామని, పోలీసులు, ANM లు కూడా మొబైల్ ఫోన్లు వాడడం నిషేధం అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పది వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష ఉంటుంది అని హెచ్చరించారు. ఈ పరీక్షలకు 1400 మంది ఇన్విజిలేటర్ లు,300 వరకు సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మీడియా సమావేశంలో విద్యా శాఖ అసిస్టెంట్ కమిషనర్ మురళి మోహన్, డిప్యూటీ EO గౌరీశంకర్ పాల్గొన్నారు.