Alluri Dist: శిథిలావస్థలో బూరుగుపుట్టు వంతెన.. ఏదీ మరమ్మతుల జాడ..!
హుకుంపేట మండలం బూరుగుపుట్టు సమీపంలో ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది...
దిశ, అల్లూరి జిల్లా: హుకుంపేట మండలం బూరుగుపుట్టు సమీపంలో ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. గతంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు వంతెన పునాదిరాళ్లు మొత్తం కొట్టుకుపోయాయి. అప్పటి ప్రభుత్వంలో ఉన్న అరకు శాసనసభ్యులు కిడారి సర్వేశ్వరరావు , సివేరి సోమ పర్యటించి పరిశీలించి కొత్త వంతెన నిర్మాణానికి నాంది పలికారు. అదే సమయంలో ప్రమాదవశాత్తు వాళ్ళిద్దరూ అకాల మరణం పొందారు. ఆ తర్వాత, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇప్పటివరకు వంతెనను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు.
ఈ వంతెన మీదుగా సుమారు 200పైగా గ్రామాలకు రాకపోకలు జరుగుతున్నాయి. వంతెన కూలిపోతే చాలా ఇబ్బందులు తలెత్తుతాయని కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని వెంటనే నూతన వంతెన నిర్మాణానికి కృషి చేయాలని వాహనదారులు కోరుతున్నారు. పొరపాటున ఏదైనా వాహనం వెళుతున్నప్పుడు ప్రమాదవశాత్తు బ్రిడ్జి కూలిపోతే ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయని, త్వరగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.