పదో తరగతి పరీక్ష రాసిన 50 ఏళ్ల గిరిజన మహిళ
చదువుకోవాలనే తపన,ఆసక్తి ఉండాలి కానీ వయసుతో సంబంధం లేదని నిరూపించారు.పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన గిరిజన మహిళ పెద్దమ్మి.మూలపాడుకి చెందిన 53 ఏళ్ల పెద్దమ్మి పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం:చదువుకోవాలనే తపన,ఆసక్తి ఉండాలి కానీ వయసుతో సంబంధం లేదని నిరూపించారు.పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన గిరిజన మహిళ పెద్దమ్మి.మూలపాడుకి చెందిన 53 ఏళ్ల పెద్దమ్మి పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. 7వ తరగతి వరకు చదివిన ఆమె అనివార్య కారణాలతో చదువు ఆపేశానాని, చదువుపై ఆసక్తితో మళ్లీ పరీక్షలు రాస్తున్నట్లు తెలిపింది.భద్రగిరి ఏపీఆర్ కేంద్రంలో ఆమె పరీక్ష రాస్తున్నారు.