విశాఖ ఉక్కు ఉద్యమం@1000రోజులు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అని నినదిస్తూ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి కార్మిక శక్తి పిడికిలి బిగించి వెయ్యి రోజులు అవుతుంది.

Update: 2023-11-08 09:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అని నినదిస్తూ  కార్మిక శక్తి పిడికిలి బిగించి నేటికి వెయ్యి రోజులు అవుతుంది. పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ 2021 ఫిబ్రవరి 12 నుంచి ఐక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉద్యమం నాటి నుంచి నిరవధికంగా కొనసాగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ చేపట్టిన ఈ ఉద్యమానికి కార్మికులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు, బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. నాటి నుంచి మెుదలైన ఈ పోరాటం బుధవారం నాటికి వెయ్యి రోజులకు చేరుకుంది. విశాఖ ఉక్కు ఉద్యమం 1000రోజులుకు చేరుకున్న సందర్భంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల బంద్‌కు ఉద్యమ కమిటీలు బుధవారం పిలుపునిచ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షకు మద్దతు తెలిపిన ప్రజలకు రాజకీయ నాయకులకు పోరాట కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని పోరాట కమిటీ తెలిపింది. విశాఖ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం విస్తరణ కోసం చేసిన రుణాలు వల్లే ఆర్థిక ఇబ్బందులు తలెత్తయని.. ఐరన్ వోర్ గనులు కేటాయిస్తే సమస్యను అధిగమిస్తామని కార్మికులు స్పష్టం చేస్తున్నారకు. ఈ సమస్యను అధిగమించేందుకు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ చూపడం లేదని కార్మిక సంఘాలు ఆరోపించాయి. ఇప్పటికే లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీ కరించవద్దని వైసీపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెట్టడంలో విఫలమైందని పోరాట కమిటీ ఆరోపించింది. ఈ మేరకు ఉక్కు ఉద్యమం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేజీ నుండి పీజీ వరకు విద్యాసంస్థల బంద్‌కు ఉద్యమ కమిటీలు పిలుపునిచ్చాయి.

Tags:    

Similar News