అవినాష్ రెడ్డి హత్య చేయడం షర్మిల, సునీతా చూశారా..? వైఎస్ విమలారెడ్డి కీలక వ్యాఖ్యలు
ఎన్నికల ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్ వివేకా హత్యకు కడప వైసీపీ ఎంపీ
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్ వివేకా హత్యకు కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డే కారణమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల వ్యాఖ్యలకు ఆమె మేనత్త వైఎస్ విమలారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వివేకాను అవినాష్ రెడ్డి హత్య చేయడం వైఎస్ షర్మిల, సునీత చూశారా అని ప్రశ్నించారు. వ్యక్తిగత స్వార్ధం కోసమే ఇలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. షర్మిల, సునీత చర్యలతో వైఎస్ ఆత్మ ఘోషిస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు కలిసి వైఎస్ కుటుంబ పరువును రోడ్డున పడేస్తున్నారని సీరియస్ అయ్యారు. షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుక్కోవడం ఏంటని.. ఓట్లు ఆడుక్కునే వాళ్లు వైఎస్ఆర్ బిడ్డ ఎలా అవుతారని ప్రశ్నించారు.