దారుణం.. పవన్ కళ్యాణ్‌కు మద్దతిచ్చారని 4 కుటుంబాల బహిష్కరణ?

నేటి సమాజంలో కూడా కులాలు, మతాల పేరిట గ్రామాల నుంచి కుటుంబాలను బహిష్కరిస్తుండటం ఇప్పటికీ వార్తల్లో చూస్తూనే ఉన్నాం.

Update: 2023-04-11 09:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేటి సమాజంలో కూడా కులాలు, మతాల పేరిట గ్రామాల నుంచి కుటుంబాలను బహిష్కరిస్తుండటం ఇప్పటికీ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ పార్టీకి మద్దతుగా నిలిచారని ఏకంగా నాలుగు కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరించారు గ్రామపెద్దలు. ఈ దుశ్చర్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం టీవీ కండ్రిగలో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా.. డీజే ప్రదర్శన జరిపించారు. ఈ క్రమంలో రెండు వర్గాలు వైసీపీ, జనసేన మద్దతుదారుల మధ్య గొడవ జరిగింది, ఈ గొడవ పెద్దది కావడంతో ఓ వర్గానికి చెందిన వారు నాలుగు కుటుంబాలను టార్గెట్ చేసి గ్రామ బహిష్కరణ చేశారు. ఈ మేరకు తాగు నీరు, కిరాణా సరుకులు తదితర వస్తువులు ఇవ్వొద్దని గ్రామంలో హుకుం జారీ చేశారు. దీంతో వారికి ఎవరు సహాయం చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురైన సదురు కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాము జనసేన మద్దతుదారులం కాబట్టే తమను టార్గెట్‌ చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. కులాలు, మతాలు, పార్టీల పేరిట మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. వాళ్ల ఫిర్యాదుకు స్పందించిన రెవెన్యూ, పోలీసు అధికారులు నేడు గ్రామంలో విచారణ చేపట్టడానికి వెళ్లనున్నారు. తాము ఈ సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు పోలీసులు.

Also Read..

జనసేన పార్టీ ఎందుకో పవన్‌కే తెలీదు.. మంత్రి అంబటి రాంబాబు 

Tags:    

Similar News