కేశినేని నానికి బుజ్జగింపులు.. రంగంలోకి కీలక నేత

విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇష్యూ ఇప్పుడు ఢిల్లీకి చేరింది....

Update: 2024-01-06 12:40 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇష్యూ ఇప్పుడు ఢిల్లీకి చేరింది. పోటీ విషయంలో తమ్ముడితో తగువు, అధినేతపై అలకను పొగ్గేట్టేందుకు హస్తిన నుంచి కీలక నేత రంగంలోకి దిగారు. ఇవాళ ఉదయం నాని రాజీనామా చేయడంతో నానిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. సహచర నేత కోసం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడకు వెళ్లి కేశినేని నానితో ఎంపీ భేటీ అయ్యారు.  రాజీనామాను వెనక్కి తీసుకోమని చెప్పారని తెలిస్తోంది.


కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయని, సర్దుకుని పోవాలని నానికి రవీంద్రకుమార్ సూచించారట. అయితే అందుకు ‘కేశినేని నాని ఎలాంటి సమధానం చెప్పారు.. రాజీనామా వెనక్కి తీసుకుంటానన్నారా..? అధినేతపై అలక వీడతానని చెప్పారా..? టీడీపీలోనే కొనసాగుతానని చెప్పి ఉంటారా..?. టీడీపీ రోజు వారి కార్యక్రమాల్లో పాల్గొంటారా..?’ అనే వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. కానీ వీరి భేటీపై మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతోంది. పలకరింపులో భాగంగా ఎంపీ కనమేడల వచ్చారా..?. అధిష్టానం పంపడంతో బుజ్జగించే దిశగా చర్యలు ప్రారంభించారా అనే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే నానితో భేటీ అనంతరం ఎంపీ కనకమేడల మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్కంఠ పెరుగుతోంది. 

కాగా విజయవాడ ఎంపీ సీటును కేశినేని చిన్నికి ఇస్తామని అధిష్టానం చెప్పడంతో కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు తిరువూరు సభకు ముందు టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంది. దీంతో కేశినేని నేనిని బుజ్జగించే పనిలో ఆ పార్టీ పడినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News