విజయవాడ దుర్గ గుడి ఘాట్ రోడ్డు మూసివేత..కారణం ఏంటంటే?

విజయవాడ దుర్గ గుడి ఘాట్ రోడ్డు మూసివేశారు. వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతున్న కారణంగా ఘాట్ రోడ్డు ఆదివారం (జులై 14) మూసివేశారు అధికారులు

Update: 2024-07-14 12:35 GMT

దిశ,వెబ్‌డెస్క్: విజయవాడ దుర్గ గుడి ఘాట్ రోడ్డు మూసివేశారు. వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతున్న కారణంగా ఘాట్ రోడ్డు ఆదివారం (జులై 14) మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగి పడుతుండటంతో ఘాట్ రోడ్డును మూసివేసినట్లుగా అధికారులు తెలిపారు. మహా మండపం నుంచి మాత్రమే భక్తులను అనుమతిస్తుందని అధికారులు చెప్పారు. కొండరాళ్లు దొర్లి పడకుండా ముందస్తుగా ఘాట్ రోడ్డును మూసివేశారు. కొండచరియల సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. నిపుణులు కొండచరియలు విరిగి పడకుండా ఒక గోడ నిర్మాణం, సిమెంటింగ్ చేసి మట్టి జారకుండా ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇక నిపుణుల సలహాను ఆమోదించిన దేవాదాయ శాఖ రెండు రోజుల్లో ప్రారంభించనుంది.


Similar News