విజయవాడ సెంట్రల్‌కు వెల్లంపల్లి.. వెస్ట్‌‌ను వీడటంపై తీవ్ర ఆవేదన

విజయవాడ వెస్ట్‌లో పుట్టి పెరిగానని, సెంట్రల్‌కు వెళ్లాలంటే కొంచెం బాధగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు....

Update: 2024-01-04 14:03 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ వెస్ట్‌లో పుట్టి పెరిగానని, సెంట్రల్‌కు వెళ్లాలంటే కొంచెం బాధగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి వెల్లంపల్లి శ్రీనివాసరావును ఇంచార్జిగా సీఎం జగన్ నియమించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ విజయవాడ వెస్ట్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో చాలా అనుబంధం ఉందని, కానీ ముఖ్యమంత్రి జగన్ అప్పగించిన బాధ్యత మేరకు విజయవాడ సెంట్రల్‌‌కు వెళ్తున్నానని వెల్లంపల్లి చెప్పారు.

విజయవాడ సెంట్రల్‌లో కూడా వైసీపీ గెలుపు కోసం ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే వెల్లంపల్లి తెలిపారు. మల్లాది విష్ణు ఏ విధంగా విజయవాడ సెంట్రల్‌లో గెలుపు జెండా ఎగురవేశారో.. అదే విధంగా తామిద్దరం కలిసి 2024లో విజయం సాధిస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు. ‘విజయవాడ వెస్ట్‌లో వెల్లంపల్లి గెలవరని ఎవరూ చెప్పలేదు. ఇక్కడ రిమార్క్‌తో విజయవాడ సెంట్రల్‌కు వెళ్లడం లేదు. సీఎం జగన్ నిర్ణయంతోనే అక్కడకు వెళ్తున్నా. టీడీపీ విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. 175 సీట్లు గెలివాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. మల్లాది వర్గం నాకు సహకరించదని నేను అనుకోవడం లేదు. నాయకుల్లో ఆవేదన ఉంటుంది. పార్టీ నిర్ణయం మేరకు అందరూ కలిసి పని చేయాలి. మల్లాది విష్ణుతో చర్చించి కలిసి కట్టుగా పని చేస్తాం. సీఎం ఆదేశాలను తూచా తప్పం. షర్మిల ప్రభావం ఏపీలో ఉండదు. ఏపీలో కాంగ్రెస్‌కు చోటు లేదు. రాష్ట్రాన్ని నాశనం చేసిన పార్టీ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం వేస్ట్.’ అని వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News