HYD - విజయవాడ హైవేపై వాహనాల రాకపోకలు ప్రారంభం

విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే జాతీయ రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

Update: 2024-09-02 10:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే జాతీయ రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. అయితే.. ప్రస్తుతం కాస్త ఉధృతి తగ్గుముఖం పట్టడంతో హైద్రాబాద్ - విజయవాడ హైవేపై వాహనాల రాకపోకలను అధికారులు ప్రారంభించినట్లు తెలుస్తున్నది. భారీ లోడ్‌తో వెళ్లే వాహనాలను నిలిపివేసి.. మిగిలిన వాహనాలను వన్ వే ద్వారా పోలీసులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. గత రెండ్రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదనీరంతా రోడ్లపైకి చేరడంతో పాటు ప్రమాదకర స్థాయికి ప్రవాహం చేరింది. దీంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని బ్యారేజీల్లో గేట్లను పైకెత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు.


Similar News