Minister Nara Lokesh : డ్రైవర్ లోవ రాజు సస్పెన్షన్ ఎత్తివేస్తారు ..స్వయంగా కలుస్తా : మంత్రి లోకేష్ ట్వీట్

బస్సు ఆగిపోయిన సందర్భంలో సరదాగా బస్సు ముందు డ్యాన్స్ చేసిన తునీ ఆర్టీసీ డ్రైవర్(RTC Driver) లోవరాజు(Lova raju)ను ఆర్టీసీ అధికారులు సస్పెండ్ చేయడంపై మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh)అసంతృప్తి వ్యక్తం చేశారు.

Update: 2024-10-28 10:09 GMT

దిశ, వెబ్ డెస్క్ : బస్సు ఆగిపోయిన సందర్భంలో సరదాగా బస్సు ముందు డ్యాన్స్ చేసిన తునీ ఆర్టీసీ డ్రైవర్(RTC Driver) లోవరాజు(Lova raju)ను ఆర్టీసీ అధికారులు సస్పెండ్ చేయడంపై మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh)అసంతృప్తి వ్యక్తం చేశారు. సస్పెన్షన్ ఎత్తివేస్తారని, తిరిగి విధుల్లో తీసుకోబడుతారని, నేను అమెరికా నుంచి వచ్చాకా పర్సనల్ గా కలుస్తానంటే లోవరాజుకు భరోసా నిస్తూ ట్వీట్ చేశారు. వివరాల్లోకి వెళితే రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ ఠాణా నుంచి రౌతలపూడి నుంచి విద్యార్థులను తీసుకుని బస్సు తునికి వెలుతున్న బస్సు కోడూరు సమీపంలో సింగిల్ రోడ్డులో ట్రాక్టర్ ఆగిపోవడంతో ముందుకు వెళ్ళలేక నిలిచిపోయింది. బస్సును ఆపేసిన డ్రైవర్ లోవరాజు ట్రాక్టర్ ను తొలగించేదాకా చేసేదేముందనుకుని దేవర సినిమా పాటలకు డ్యాన్స్ చేశాడు.

ఈ వీడియోను కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన మంత్రి నారా లోకేష్ డ్యాన్స్ అదరగొట్టారంటూ డ్రైవర్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అయితే ఆర్టీసీ ఉన్నతాధికారులు మాత్రం ఈ సంఘటనపై విచారణకు ఆదేశించి, డ్రైవర్ ను సస్సెండ్ చేసారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ ఆర్టీసీ అధికారుల నిర్ణయంపై మరో ట్వీట్ లో అసంతృప్తి వ్యక్తం చేశారు. లోవ రాజు డ్రైవర్ ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, సస్పెన్షన్ ఆర్డర్ ను ఎత్తివేస్తారని.. ఆయన వెంటనే తన ఉద్యోగంలో చేరొచ్చని తెలిపారు. అలాగే నేను అమెరికా నుంచి రాగానే.. లోవరాజును పర్సనల్ గా కలుస్తాను అంటూ ట్వీట్ చేశారు. లోకేష్ ట్వీట్ చూసిన నెటిజన్లు మంత్రి ఔదార్యంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Read More..

RTC Driver:ఆగిపోయిన ఆర్టీసీ బస్సు.. ఆ సాంగ్‌తో అదిరిపోయే స్టెప్పులు వేసిన డ్రైవర్(వీడియో వైరల్) 

Tags:    

Similar News