కళింగపట్నం సమీపంలో తీరం దాటిన వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.

Update: 2024-09-01 04:19 GMT

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ వాయుగుండం.. శనివారం అర్ధరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. అనంతరం వాయవ్యంగా పయనిస్తుంది. కాగా ఇది ఉత్తరాంధ్ర మీద ఆవరించి సాయంత్రానికి లేదా రేపు ఉదయానికి బలహీన పడుతున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో అనేక చోట్ల ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.


Similar News