యువగళం ముగింపు సభ అట్టర్ ప్లాప్..జనసేన వల్ల ఒరిగిందేమిటి?: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభ అట్టర్ ప్లాప్ అని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.

Update: 2023-12-21 05:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభ అట్టర్ ప్లాప్ అని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. యువగళం నవశకం బహిరంగ సభకు జనం కరువయ్యారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్‌ను ఎదుర్కొనే సత్తా లేక టీడీపీ పొత్తులతో ముందుకు వెళ్తోందని అన్నారు. వైఎస్ జగన్ అంటే అటు టీడీపీ, జనసేన పార్టీలకు భయం పట్టుకుందని విమర్శించారు. భయం ఎలా ఉంటుందో లోకేశ్‌కు బాగా తెలుసునన్నారు. తండ్రి అరెస్ట్ అయితే ఢిల్లీ పారిపోయి ఇరవై రోజులు దాక్కున్న వ్యక్తి నారా లోకేశ్ అని ధ్వజమెత్తారు.నీకు భయముంది.. జగన్‌కి ప్రజాబలం ఉంది అని చెప్పుకొచ్చారు. ఏ సంబంధం లేకపోయినా అన్యాయంగా అక్రమంగా జగన్‌పై అప్పటి కేంద్రం కేసులు పెట్టింది. ఐదేళ్లు పాలనలో అవినీతి చేసి ఆధారాలతో దొరికిన దొంగ చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబుపై కక్షసాధించాల్సిన అవసరం తమకు లేదు అని చెప్పుకొచ్చారు. సీఎం జగన్‌ సిద్ధాంతాలు ప్రజలకు నచ్చేలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలో మార్పులు సహజం..సీఎం జగన్‌ ప్రజలకు మేలు చేసే ఒక వ్యవస్థ అని స్పష్టం చేశారు. రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి పవన్.. మంగళగిరిలో ఓడిపోయిన వ్యక్తి నారా లోకేశ్ అని మల్లాది విష్ణు గుర్తు చేశారు.

జనసేన వల్ల ఉపయోగం ఏంటి?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని పెట్టి పదేళ్లయ్యిందని ఆ పార్టీ వల్ల ప్రజలకు ఏం ఉపయోగం అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. గాజువాకలో ఏం జరిగిందో.. భీమవరంలో ఏం జరిగిందో అందరికీ తెలుసునన్నారు. మంగళగిరిలో కూడా ఏం జరిగిందో నారా లోకేశ్‌కు తెలుసునని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా సత్తాలేక అంతా కలిసి జగన్‌ను ఢీకొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.టీడీపీ, పవన్ కలిసి పని చేసిన ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీలేదు అని చెప్పుకొచ్చారు. సీఎం జగన్‌ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసిన ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. భయం అంటే ఏంటో వైసీపీకి తెలియదు..పెద్ద పెద్ద వ్యక్తుల్ని ఢీకొట్టి నిలబడిన వ్యక్తి జగన్‌ అని చెప్పుకొచ్చారు.జగన్‌ను మార్చేయాలంటున్న పవన్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 

Tags:    

Similar News