వైసీపీ నేత మద్యం షాపుపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

Update: 2024-10-16 06:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ ఓ మద్యం షాపుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. సత్యసాయి జిల్లా, ధర్మవరంలో ఇటీవలే ఎలాట్ అయిన ఏడో నెంబర్ షాపులో దూరిన దుండగులు షాపులోని మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. మద్యం దుకాణం ఈ రోజు (బుధవారం) ప్రారంభం కానుండగా.. రాత్రికి రాత్రి దాడి చేసిన ఆగంతకులు లోపలి బాటిళ్లన్నింటినీ ధ్వంసం చేశారు. మొత్తం రూ.3 లక్షల విలువైన సరుకు ధ్వంసమైనట్లు యజమాని పేర్కొన్నారు. అయితే ఈ మద్యం దుకాణం వైసీపీ నేత బాలిరెడ్డిది కావడంతో దాడిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. తనకు మద్యం షాపు దక్కడంతో ఓర్వలేక కూటమి ప్రభుత్వానికి చెందిన టీడీపీ, బీజేపీ వాళ్లే ఈ దాడి చేయించారని బాలిరెడ్డి ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించి లాటరీ పద్ధతిలో కేటాయింపులు జరిపిన విషయం తెలిసిందే. 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలు కానున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి షాపులు దక్కించుకున్న వ్యక్తులు మద్యం అమ్మకాలు ప్రారంభించేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతులిచ్చింది.


Similar News