అందుకే రైల్వే జోన్ ప్రక్రియ ఆలస్యం: కేంద్ర మంత్రి రామ్మోహన్
విశాఖ రైల్వే జోన్‌కు గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ రైల్వే జోన్‌కు గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. అందుకే ప్రస్తుతం రైల్వే జోన్ ప్రక్రియ ఆలస్యం అవుతోందనిఅ న్నారు. రైల్వే జోన్ కోసం గతంలోనే కేంద్రం బడ్జెట్ కేటాయించిందని గుర్తుచేశారు. రైల్వే జోన్‌కు కావాల్సిన భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల అంశంలో కేంద్రం సానుకూలంగా ఉందని అన్నారు.