విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి కీలక హామీ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి హెచ్ డి. కుమార స్వామి స్పష్టం చేశారు..
దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి హెచ్ డి. కుమార స్వామి స్పష్టం చేశారు. కేంద్ర ఉక్కు శాఖా సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మతో కలిసి స్టీల్ ప్లాంట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కుమార స్వామి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్‌ను 100 శాతం సామర్ధ్యంతో పని చేసేలా చూస్తామన్నారు. ప్రధానితో మాట్లాడి 2,3 నెలల్లో పూర్తి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్‌కు ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. ప్లాంట్ ఉద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేంద్రం అండగా ఉంటుందని కేంద్రమంత్రి కుమార స్వామి భరోసా ఇచ్చారు.