విషాదం.. కోడికి ఈత నేర్పించడానికి వెళ్లి ఇద్దరు మృతి, మరొకరి గల్లంతు

పందెం కోడికి ఈత నేర్పించడానికి వెళ్లి ఇద్దరు మృత్యువాత పడ్డారు.

Update: 2024-10-09 11:27 GMT

 దిశ, వెబ్ డెస్క్: పందెం కోడికి ఈత నేర్పించడానికి వెళ్లి ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా పెదవేగి మండలం కల్వగుంట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంక్రాంతి పండుగకు రాష్ట్రంలో జరిగే కోడి పందెం కోసం.. కల్వగుంట గ్రామానికి చెందిన వ్యక్తి తన కొడుకులతో కలిసి స్థానికంగా ఉన్న కుంట లోకి వెళ్లారు. ఈ క్రమంలో తమ పందెం కొడికి ఈత కొట్టిస్తుండగా ప్రమాదవశత్తు.. ముగ్గురు నీటిలో మునిగిపోయారు. ఎవరికి ఈత రాకపోవడంతో ముగ్గురు నీటిలో మునిగిపోయారు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకునే లోపే తండ్రి కొడుకులు నీటిలో మునిగిపోయారు. కాగా కొద్ది సేపటికి తండ్రి, ఓ కుమారుడి మృతదేహాన్ని వెలికి తీశారు. మరో కుమారుడు ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. గల్లంతైన బాలుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పండగ పూట తండ్రి కొడుకులు నీటిలో మునిగి చనిపోవడం తో కల్వగుంట గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Similar News