‘వాంతులు, విరేచ‌నాల‌తో ఇద్ద‌రు మృతి’.. మంత్రి నారాయణ కీలక ఆదేశాలు

ప‌ల్నాడు జిల్లాలోని దాచేప‌ల్లిలో వాంతులు, విరేచ‌నాల‌తో ఇద్ద‌రు వ్య‌క్తులు మృతిపై మంత్రి నారాయ‌ణ(Minister Narayana) స‌మీక్ష‌ నిర్వహించారు.

Update: 2024-10-24 12:09 GMT

దిశ,వెబ్‌డెస్క్: ప‌ల్నాడు జిల్లాలోని దాచేప‌ల్లిలో వాంతులు, విరేచ‌నాల‌తో ఇద్ద‌రు వ్య‌క్తులు మృతిపై మంత్రి నారాయ‌ణ(Minister Narayana) స‌మీక్ష‌ నిర్వహించారు. ఈ క్రమంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. వారి మృతికి నీరు క‌లుషితం కావ‌డమే కారణమా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. స్థానికంగా ఉన్న బోర్ల‌లో నీటిని విజ‌య‌వాడ ల్యాబ్‌కు ప‌రీక్ష‌ల‌కు పంపాల‌ని ఆదేశించారు. బోర్ల‌ను మూసివేసి వాట‌ర్ ట్యాంక‌ర్ల(Water tankers) ద్వారా తాగునీరు స‌ర‌ఫ‌రా చేయాల‌ని సూచించారు. హెల్త్ క్యాంపు(Health camps)లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే డ్రైనేజీల్లో మురుగును తొలగించడంతో పాటు అన్ని మంచి నీటి బోర్లను తనిఖీ చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఇతర మున్సిపాలిటీల నుంచి సిబ్బందిని రప్పించాలన్నారు. సాధారణ పరిస్థితి వచ్చే వరకు మున్సిపల్, వైద్యారోగ్య శాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జేసీ సూరజ్, ఆర్‌డీఎంఏ హరికృష్ణ డీఎంహెచ్‌వో రవికుమార్ పబ్లిక్ హెల్త్ ఎస్ ఈ శ్రీనివాస్ నగర పంచాయతీ కమిషనర్ అప్పారావు సమీక్షలో పాల్గొన్నారు.

Tags:    

Similar News