Thungabhara Dam: తుంగభద్ర డ్యామ్‌‌లోకి కొనసాగుతోన్న వరద.. అధికారుల కీలక నిర్ణయం

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కర్ణాటక రాష్ట్రం హోస్పేట్‌లోని తుంగభద్ర డ్యామ్ 19వ గేట్ చైన్ లింక్ తెగి గేటు భాగం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది.

Update: 2024-08-14 05:09 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కర్ణాటక రాష్ట్రం హోస్పేట్‌లోని తుంగభద్ర డ్యామ్ 19వ గేట్ చైన్ లింక్ తెగి గేటు భాగం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్ట్‌పై భారం పడకుండా 33 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు చేసి నీటి వృథాను అరికట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 32,924 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 1,20,097 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి మట్టం 1627.15 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు ఉంది. మరోవైపు డ్యామ్ గేటు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. స్టాప్ లాగ్ గేటు ఏర్పాటుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. డ్యామ్ నీటి సామర్థ్యం 76.48 టీఎంసీలకు తగ్గించి గేట్లు బిగించాల్సి ఉంటుందని ఇరిగేషన్ నిపుణుడు కన్నయ్య వెల్లడించారు. ఈ క్రమంలో మరికొన్ని గంటలు వేచి చూడాలని అధికారులు నిర్ణయించారు. అదేవిధంగా ఈ నెల 20 వరకు తుంగభద్ర డ్యామ్2పై రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు.    

Tags:    

Similar News