టికెట్ ఇవ్వని పవన్ కల్యాణ్.. కార్యకర్తల ముందే కన్నీరు పెట్టుకున్న బాబు..!

టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటనతో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. ఫస్ట్ లిస్ట్‌లో తమ పేరు లేకపోవడంతో టికెట్ ఆశావాహులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

Update: 2024-02-26 04:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటనతో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. ఫస్ట్ లిస్ట్‌లో తమ పేరు లేకపోవడంతో టికెట్ ఆశావాహులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. టికెట్ దక్కకపోవడంతో కొందరు పార్టీ మారేందుకు ప్లాన్ చేసుకుంటుండగా.. మరికొందరు హై కమాండ్‌కు అల్టీమేటం జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లాలోని పెద్దాపురం జనసేనలో అసమ్మతి నెలకొంది. పొత్తులో భాగంగా పెద్దాపురం టికెట్ టీడీపీకి కేటాయించడంతో జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పెద్దాపురం జనసేన ఇన్‌ఛార్జ్ తుమ్మల బాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఇవాళ అత్యవసర భేటీ అయ్యారు. జనసేనకు టికెట్ దక్కకపోవడంతో పలువురు నేతలు జిల్లా పదవులకు రాజీనామా చేశారు. టికెట్ ఆశించి భంగపడ్డ ఇన్‌ఛార్జ్ తుమ్మల బాబు కార్యకర్తల ముందే కంటతడి పెట్టుకున్నారు. ఈ సమావేశంలో బాబు మాట్లాడుతూ.. పార్టీని నమ్ముకుని కార్యకర్తలు పని చేశారని, కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై ఉందని అన్నారు. లేకపోతే త్వరలోనే నా భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని అధిష్టానానికి హెచ్చరిక పంపారు. 

Read More..

Brwaking News: టీడీపీలో చేరడంపై క్లారిటీ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్.. ఏమన్నారంటే!  

Tags:    

Similar News