షటిల్ ఇలా ఆడాలని తెలియదు సర్ మాకు.. సీఎంపై ట్రోల్స్ (Meme Of The Day)
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది.
దిశ, ఫీచర్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే అధికార పార్టీ లీడర్లు, అపోజిషన్ నేతలు ప్రసంగాలు మొదలు పెట్టేశారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఎన్నికల రంగంలోకి దిగిపోయారు. ఇదిలా ఉంటే.. ఏపీ సీఎం జగన్ ఏది చేసిన నెట్టింట ట్రోల్స్ ఎదుర్కుంటుంటారు. ఆయన ఇచ్చే స్పీచ్ దగ్గర నుంచి చేసే ప్రతీ పని వరకు.. ట్రోల్సర్స్‌కు మంచి కంటెంట్ దొరుకుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఏర్పాటు చేసిన పార్టీ మీటింగ్‌లో సీఎం జగన్ గేమ్స్ ఆడి ఆకట్టుకున్నారు. అయితే.. షటిల్ గేమ్ ఆడిన జగన్ కుడిచేతిలో బ్యాట్ పట్టుకుని ఆడుతూనే.. ఎడమచేతిలో కాక్ పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఓ క్లిప్‌ను ట్రోల్ చేస్తూ.. ‘సారీ మామయ్య.. cock నీ చేతిలో పట్టుకుని బ్యాట్ గాలిలో ఊపాలని తెలియక మామూలుగా బ్యాట్‌తో కాక్‌ని కొడుతున్నాం’ అంటూ మీమ్స్ వేసుకుంటున్నారు మీమర్స్.