Trending: వెజిటెబుల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన టమాటా ధర

వారం క్రితం సామాన్యులను అల్లాడించిన టమాటా ధరలు క్రమక్రమంగా దిగొస్తున్నాయి.

Update: 2024-08-24 14:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: వారం క్రితం సామాన్యులను అల్లాడించిన టమాటా ధరలు క్రమక్రమంగా దిగొస్తున్నాయి. దీంతో వెజిటెబుల్ లవర్స్ పండగ చేసుకుంటున్నారు. కర్నూల్ మార్కెట్ యార్డులో కిలో టమాటా రూ.20 పలుకుతోంది. మరోవైపు ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చే సమయంలో మర్కెట్‌లో ధరలు అమాంతం పడిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. పెట్టిన పెట్టుబడికి కూడా రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతు బజార్లలో కిలో టమాటా రూ.20 నుంచి రూ.25 పలుకుతుండగా, రైతులకు కిలో రూ.4 నుంచి రూ.5 మాత్రమే దళారులు చెల్లిస్తున్నారు. ఇక పత్తికొండ మార్కెట్‌లో12 కిలోల టమాటా కేవలం రూ.50కే విక్రయిస్తున్నారు. 


Similar News