Tragedy: వారసుడిని ఇవ్వలేనంటూ గర్భిణీ సూసైడ్
కృష్ణా జిల్లా యనమలకుదురలో విషాదం చోటు చేసుకుంది...
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా యనమలకుదురలో విషాదం చోటు చేసుకుంది. ఐదు నెలల గర్భిణీ బలవన్మరణానికి పాల్పడ్డారు. శ్రీకాంత్, కావ్య దంపతులు యనమలకుదురులలో నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె ఉంది. కావ్య ఐదు నెలల గర్భిణీ కావడంతో మగబిడ్డ కావాలంటూ భర్త వేధింపులకు గురిచేశారు. మనస్థాపం చెందిన భార్య.. వారసుడిని ఇవ్వలేనంటూ భర్తకు మెసేజ్ పెట్టి ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గర్భిణీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతరాలి బంధువులు ఆందోళనకు దిగారు. భర్త శ్రీకాంత్ వేధింపు వల్లే కావ్య చనిపోయిందని ఆరోపించారు. శ్రీకాంత్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.