Breaking:రేపు తెలంగాణ, ఏపీ విద్యాసంస్థలకు సెలవులు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వర్షాలు దంచికొడుతున్నాయి.

Update: 2024-09-01 12:55 GMT

దిశ,వెబ్‌డెస్క్:బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అటు ఏపీలో భారీ వర్షాలు, వరదల పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని ప్రకటించారు. ఈ క్రమంలో కుండపోత వర్షాలు, వరదలకు తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్లకు సెలవు ప్రకటించాయి. తొలుత ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ఇవ్వగా, తాజాగా సీఎంలు చంద్రబాబు, రేవంత్ అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


Similar News