టమాటా ధర భారీగా పతనం.. కన్నీరు పెడుతున్న రైతులు

ఏపీలో టమాటా ధర భారీగా పతనం అయింది. ..

Update: 2024-08-26 14:06 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో టమాటా ధర భారీగా పతనం అయింది. మొన్నటి వరకూ వినియోగదారులకు చుక్కలు చూపించిన టమాటా ఇప్పుడు రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది. రాష్ట్రంలో వర్షాలు పడుతుండటంతో టమాటా దిగుబడి భారీగా తగ్గింది. అంతేకాదు ధరలు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. రాయలసీమ ప్రాంతంలో రైతులు ఎక్కువగా టమాటాను సాగు చేస్తారు. అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలో సాగు అధికంగా ఉంటుంది. అయితే వర్షాల పుణ్యమా దిగుబడులు తగ్గాయి. మే, జూన్ నెలలో వర్షాలు లేకపోయినా పంట చివరి దశలో ఉంది. అంతేకాదు ఆ సమయంలో టమాటాకు విపరీతమైన డిమాండ్ ఉంది. 15 కిలోల టమాటా బాక్సుకు రూ. 800 నుంచి రూ.1000 వరకు వచ్చింది.  దీంతో టమాటా సాగుపై రైతులకు మరింత ఆశలు చిగురించాయి. ఈ మేరకు అధికంగా సాగు చేసేందుకు పంటలు వేశారు. కానీ వర్షాల పుణ్యమా రైతులు లబోదిబో మంటున్నారు. దిగుబడి తక్కువగా వచ్చింది.  15 కిలోల టమాటా బాక్సు రూ. 250 నుంచి రూ. 300 కూడా రావడం లేదు.  దీంతో సాగు చేసిన పంటకు కోతలు, మార్కెట్‌కు తరలింపు, రవాణా, ఎగుమతి, దిగుమతి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Similar News