నేడు చాగంటి కోటేశ్వరరావు పుట్టినరోజు

ఆయన ఉపన్యాసాలు వినడానికి ప్రజలు ఆసక్తి చూపుతుంటారు

Update: 2024-07-14 03:03 GMT

దిశ, ఫీచర్స్: చాగంటి కోటేశ్వరరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఉపన్యాసాలు వినడానికి ప్రజలు ఆసక్తి చూపుతుంటారు.1959 జూలై 14 న జన్మించారు. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు గోల్డ్ మెడిలిస్ట్ గా ఎదిగారు. కుటుంబం కోసం ఆయన ఎంతగానో కష్ట పడ్డారు. సొంత అక్కల పెళ్లిళ్లు కూడా అతని సంపాదన తోనే ఘనంగా చేసారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించారు. నేడు చాగంటి కోటేశ్వరరావు అంటే తెలియని వాళ్లు లేరు. సోషల్ మీడియాలో అతని ప్రసంగాలు, ప్రవచనాలను అనేకమంది చూస్తూ ఉంటారు. ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ తరం వారికి సనాతన ధర్మం గురించి అర్ధం అయ్యేలా చెబుతుంటారు. ఎక్కువుగా క్తి టీవి, టీటీడి ఛానెల్‌లలో ఆయన ప్రసంగాలు ప్రసారమవుతాయి. ఈ రోజు ఆయన 65 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు . ఈ సందర్భంగా ప్రముఖులు బర్త్ డే విషెస్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు.


Similar News