నేడు టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు 73వ పుట్టినరోజు

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు తన 73వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు.

Update: 2023-04-20 02:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు తన 73వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా ఆయన దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. నేటి నుంచి ఎన్నికల వరకు ప్రజల మధ్యే ఉండేలా ప్రణాళికలు రచించుకున్న చంద్రబాబు ఈ రోజు నుంచే అది అమలు చేయనున్నారు. పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు రూపొందించిన పాటను టీడీపీ తన అధికారిక ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. పార్టీ శ్రేణులు, సామాన్య ప్రజలు ఈ పాటకు ట్వీట్స్, రీ ట్వీట్స్ చేస్తూ తమ అధినేతకు శుభాకాంక్షులు తెలుపుతున్నారు.

Tags:    

Similar News