తిరుమలలో అక్రమంగా శారదాపీఠం మఠాలు.. కూల్చివేయాలంటున్న జనసేన
తిరుమలలో అక్రమంగా వెలిసిన మఠాలను తొలగించాలని తిరుపతి జనసేన డిమాండ్ చేస్తోంది..
దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వం హయాంలో తిరుమలలో అక్రమంగా మఠాలు వెలిశాయని, వాటిని తొలగించాలని తిరుపతి జనసేన డిమాండ్ చేస్తోంది. తిరుమలలోని శారదాపీఠం నిర్మాణాలను జనసేన నేత కిరణ్ రాయల్ అధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ తిరుమలలో శారదాపీఠానికి వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చిందని మండిపడ్డారు. మఠాల అక్రమ కట్టడాలను నేలమట్టం చేయాలని డిమాండ్ చేశారు. మఠాల పేరుతో కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందని ఆరోపించారు. మఠాల అక్రమ కట్టాలపై టీటీడీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. తిరుమల ప్రక్షాళన మఠాల నుంచే జరగాలని సూచించారు. తిరుమలలో అక్రమంగా నిర్మించిన శారదా పీఠం మఠాలపై మంగళవారం టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు.