Tirumala Update: భారీ వర్షాల ఎఫెక్ట్.. పూర్తిగా తగ్గిన భక్తుల రద్దీ
భారీ వర్షాల నేపథ్యంలో తిరుమల ఆలయానికి భక్తుల రద్దీ భారీగా తగ్గింది.
దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాల నేపథ్యంలో తిరుమల ఆలయానికి భక్తుల రద్దీ భారీగా తగ్గింది. వరదల కారణంగా పలు రైళ్లు రద్దు అవ్వడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి భక్తుల రాకపోకలు నిలిచిపోయాయి. 6 గంటల్లోనే భక్తులకు శ్రీవారి దర్శనం అవుతోంది. మంగళవారం ఉచిత సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక రూ.300లతో ప్రత్యేక టోకెన్ తీసుకున్న భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం శ్రీవారిని 63,936 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.4.55 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు.