Tirumala Samacharam: భక్తులతో పోటెత్తిన తిరుమల క్షేత్రం.. శిలాతోరణం వరకు కొనసాగుతున్న భక్తుల క్యూ లైన్
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు.
దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. గురువారం శ్రీవారిని దర్శనానికి జనం తండోపతండాలుగా జనం తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అదేవిధంగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి భక్తుల శ్రీవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు.
ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 9 నుంచి 10 గంటల సమయం పడుతోంది. శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వ దర్శనానికి కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ కొనసాగుతోంది. బుధవారం స్వామి వారిని 76,369 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 41,927 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.