Tirumala Samacharam: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.
దిశ, వెబ్‌డెస్క్: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం శ్రీవారిని దర్శనానికి జనం ఓ మోస్తారుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు రావడంతో తిరుమల క్షేత్రానికి ఈ మధ్య భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతోంది. బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 17 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. మంగళవారం స్వామి వారిని 76,381 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 33,509 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.