Tirumala: శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి గుడ్ న్యూస్..దర్శనం టికెట్లు, గదులపై కీలక అప్‌డేట్

తిరుమల(Tirumala) శ్రీవారి భక్తులకు టీటీడీ(TTD) శుభవార్త చెప్పింది.

Update: 2024-09-17 21:20 GMT

దిశ, వెబ్‌డెస్క్:తిరుమల(Tirumala) శ్రీవారి భక్తులకు టీటీడీ(TTD) శుభవార్త చెప్పింది. డిసెంబర్(December) నెల‌కు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను సెప్టెంబరు 18(September)న ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబరు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబరు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లిస్తే లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

డిసెంబర్ నెల‌కు సంబంధించి శ్రీవారి టికెట్ల విడుదల తేదీల వివరాలు..

  • ఆర్జిత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ : సెప్టెంబరు 18 ఉదయం 10గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు
  • కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు సెప్టెంబరు 21న ఉదయం 10గంటలకు విడుదల.
  • వర్చువల్‌ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించి టికెట్లు సెప్టెంబరు 21న మధ్యాహ్నం 3గంటలకు విడుదల.
  • అంగప్రదక్షిణం టోకెన్ల కోటా 23న ఉదయం 10గంటలకు విడుదల.
  • శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించి డిసెంబరు నెల కోటా 23న ఉదయం 11 గంటలకు విడుదల.
  • వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను సెప్టెంబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల.
  • ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబరు 24న ఉదయం 10 గంటలకు విడుదల.
  • డిసెంబరు నెల వసతి గదుల కోటాను సెప్టెంబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల.
  • సెప్టెంబరు 27న శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేయనున్నారు.
  • శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Similar News