తల్లి కోసం పులి పిల్లల ఎదురుచూపు.. ఏం తినకపోవడంతో..
పెద్దగుమ్మడాపురం గ్రామ సమీపంలో ఆదివారం నాలుగు పులిపిల్లలు కనిపించడం కలకలం రేపిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామ సమీపంలో ఆదివారం నాలుగు పులిపిల్లలు కనిపించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. వెంటనే గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు బైరూట్లి పశు వైద్యశాలకు తరలించారు. అయితే తల్లి కోసం పులి పిల్లలు ఎదురు చూస్తున్నాయి. పులి పిల్లలకు 40 రోజుల వయసు ఉన్నట్లు అటవీ అధికారులు గుర్తించారు.
తల్లి పులి చెంతకు పిల్లలను చేర్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఊరి చుట్టుపక్కల 40 ట్రాప్ కెమెరాలను అధికారులు అమర్చారు. కెమెరాల్లో పులిజాడ కోసం అధికారులు చూస్తున్నారు. కాగా పులి పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదాల కారణంగా పులి గ్రామంలోకి వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.