Minister Atchannaidu:సౌదీలో చిక్కుకున్న వారిని స్వదేశానికి రప్పిస్తాం
విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని స్వదేశానికి తీసుకచ్చేందుకు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని స్వదేశానికి తీసుకచ్చేందుకు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న పలువురు మంత్రి లోకేష్(Minister Nara Lokesh) చొరవతో సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సౌదీ అరేబియాలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లా(Srikakulam District)కు చెందిన యువతను స్వదేశానికి రప్పిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) తెలిపారు. జిల్లాలోని పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, కంచిలి, ఇచ్ఛాపురం ప్రాంతాలకు చెందిన 16 మంది యువకులు అక్కడ చిక్కుకున్నారు. ఏజెంట్ల ద్వారా మోసపోయిన యువకులను తిరిగి సొంత ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఈ అంశాలపై చర్చించి తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో పరిశ్రమల అభివృద్ధి, యువతలో నైపుణ్య శిక్షణ పెంపొందించేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు.