జనసేన నుంచి ఎంపీలుగా పోటీ చేసే ఆ ముగ్గురు వీరే..!

వచ్చే ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైసీపీ అరాచక పాలన నుంచి ఏపీ ప్రజలను కాపాడేందుకు జనసేనాని పవన్ కల్యాన్.. టీడీపీతో కలిసి నడుస్తున్నారు.

Update: 2024-02-25 14:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైసీపీ అరాచక పాలన నుంచి ఏపీ ప్రజలను కాపాడేందుకు జనసేనాని పవన్ కల్యాన్.. టీడీపీతో కలిసి నడుస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండడానికి బీజేపీతోను ఇరు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన మధ్య కొలిక్కి వచ్చిన 99 స్థానాలను శనివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో అభ్యర్థులను ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వారు ప్రకటించారు.

ఇందులో 5 అసెంబ్లీ స్థానాలకు పవన్ కల్యాన్ అభ్యర్థులను ప్రకటించగా.. మిగిలిన 19 మంది పేర్లను త్వరలో చెబుతామన్నారు. అయితే జనసేనకు వచ్చిన మూడు పార్లమెంట్ స్థానాలపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఏ ఏ స్థానాలు జనసేనకు కేటాయించారు. ఆ స్థానాల నుంచి ఎవరు పోటీ చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన పోటీ చేసే పార్లమెంట్ స్థానాలు, అభ్యర్థులు వీరే అంటూ సోషల్ మీడియాలో ముగ్గురు పేర్లు వైరల్ గా మారాయి.

ఇందులో.. జనసేన చీఫ్ పవన్ కల్యాన్ సోదరుడు నాగబాబు అనకాపల్లి నుంచి, వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం నుంచి, సానా సతీశ్ కాకినాడ లోక్ సభ స్థానలనుంచి పోటి చేయడం ఖాయం అయినట్లు తెలుస్తుంది. ఏదైన మార్పులు జరిగితే.. కాకినాడలో మాత్రం మార్పులు జరిగే అవకాశం ఉందనే వార్తలు సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే బీజేపీతో పొత్తు ఖాయం అయితే.. కాకినాడ ఎంపీ సీటును బీజేపీకి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Read More..

ఆ రోజే కలెక్టరేట్ లో "జగనన్నకు చెబుదాం - స్పందన" కార్యక్రమం

Tags:    

Similar News