YS Sharmila:‘కూటమి సర్కార్ ట్రెండ్ ఇదే’.. వైఎస్ షర్మిల సెన్సేషనల్ కామెంట్స్

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై ఏపీ పీసీసీ(AP PCC) చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-03 14:45 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై ఏపీ పీసీసీ(AP PCC) చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ(YCP) హయాంలో ఆస్తులను లాక్కొవడం ట్రెండ్‌గా మారితే, వాటిని చూసి మౌనంగా ఉండటం కూటమి సర్కార్(AP Government) ట్రెండ్‌గా పెట్టుకుందని వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా గత ప్రభుత్వం ధారాదత్తం చేసిన ఆస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. గంగవరం పోర్టును గత ప్రభుత్వం అదానీకి రాసిచ్చిందని, తిరిగి వాటాను వెనక్కు తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న బియ్యం అక్రమ రవాణా(Rice smuggling) పై ఆమె నిన్న మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం(Ration Rice) అక్రమంగా పోర్టు దాకా ఎలా చేరుతుంది? మూడేళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా సేకరించారు? వెనకున్న బియ్యం దొంగలెవరు? రూ.48 వేల కోట్లు ఎవరెవరు తిన్నారు? అప్పటి ప్రభుత్వ పెద్దలకు బియ్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయా? మిల్లర్ల చేతివాటం ఉందా? రేషన్ డీలర్ల మాయాజాలమా? అనునిత్యం తనిఖీల సంగతి ఏంటి? నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

Tags:    

Similar News