YS Jagan:కర్నూల్‌లో పర్యటించిన మాజీ సీఎం.. కారణం ఇదే!
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS Jagan) నేడు(బుధవారం) కర్నూలు జిల్లా(Kurnool District)లో పర్యటించారు.
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS Jagan) నేడు(బుధవారం) కర్నూలు జిల్లా(Kurnool District)లో పర్యటించారు. వైసీపీ నేత(YCP Leader) తెర్నెకల్ సురేంద్ర రెడ్డి కుమారై వివాహ రిసెప్షన్‌కు ఆయన హజరయ్యారు. ఈ క్రమంలో నూతన వధూవరులు డా.చతుర, డా.నిఖిల్‌ను ఆశీర్వదించారు. జగన్ రాకతో కోలాహలంగా మారింది. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. వారందరికీ అభివాదం చేసి వైఎస్ జగన్ ముందుకు కదిలారు.
అనంతరం హెలికాప్టర్‌లో తాడేపల్లి(Tadepalli)కి చేరుకున్నారు. కాగా తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశమవుతారని తెలుస్తోంది. అయితే.. బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి.. కర్నూలులోని ఏపీఎస్పీ గ్రౌండ్స్ హెలిప్యాడ్‌కు ఉదయం 11:55 గంటలకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బళ్లారి క్రాస్‌రోడ్ మీదుగా కర్నూలు నగర శివార్లలోని జీఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని నవ దంపతులను ఆశీర్వదించారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు ఏపీఎస్పీ గ్రౌండ్స్‌కు చేరుకుని హెలికాప్టర్‌లో తాడేపల్లికి బయలుదేరారు.