గీతాంజలి మృతికి కారకులు వాళ్ళే.. తేల్చేసిన జనం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారిన అంశం తెనాలికి చెందిన గీతాంజలి మృతి.

Update: 2024-03-12 09:53 GMT

దిశ వెబ్ డెస్క్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారిన అంశం తెనాలికి చెందిన గీతాంజలి మృతి. ఇటీవల తెనాలిలో జరిగిన వైసీపీ సభలో ఇంటి పట్టా అందుకున్న ఆమె తన ఆనందాన్ని యూట్యూబ్ ఛానల్ తో పంచుకున్నారు. సొంత ఇల్లు కావాలి అనే తన కల నెరవేరింది అని.. అలానే తన పిల్లలకు అమ్మ ఒడి, మాకు పెన్షన్, అత్తకు చేయూత వస్తున్నాయని హర్షం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.

అయితే అనుకోని విధంగా ఆమె రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఆమె మృతికి సోషల్ మీడియాలో టీడీపీ చేయించిన ట్రోలింగ్ కారణం అని ఆమె భర్త ఆరోపిస్తున్నాడు. అయితే అధికార పార్టీ గీతాంజలి మృతికి టీడీపీ కారణం అని.. టీడీపీ నే ఆమె పై ట్రోలింగ్ చేయించి నిండు ప్రాణాన్ని బలితీసుకుందని ధ్వజమెత్తింది. ఈ ఘటనపై మంత్రి రోజా కూడ స్పందించారు.

గీతాంజలి మరణానికి కారణమైన వాళ్ళ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గీతాంజలి మృతి పై ఓ వ్యక్తి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఏంటి ఈవిడ చనిపోయిందా? జగన్ నాకు మంచిచేసాడు అని చెప్పటం ఈమె చేసిన తప్పా..? అని ప్రశ్నించారు. trolls చేసి నిండు ప్రాణాన్ని తీసారు కదరా.. ఎటు వెళ్తున్నది రా సమాజం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాపం రా ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ పోస్ట్ పై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. పాపం ఎంట్రా పైడ్ ఆర్టిస్ట్ నువ్వో ఆర్టిస్ట్ అది బోడి ఆర్టస్ట్ 5 సార్లు అమ్మవొడి తీసుకుందంట వాడు వేసింది 4 సార్లు ఇంకా చాలా డబ్బు దాచిందంట మంచి ఆర్టిస్ట్ ని పెట్టండ్రా దొరికే వాళ్లు వొద్దురా అని ఒకరు కామెంట్ చెయ్యగా.. ఆమె చనిపోయిందని పోస్టులు చూస్తున్నా.

నిజమే అయితే మిగిలినోళ్లు వాళ్లకి అనుకూలంగా మాట్లాడేటపుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సానుభూతి కోసం వాళ్లే చంపి ప్రతిపక్షాలను తిట్టవచ్చు. శవ రాజకీయాల కోసం కోడికత్తి, బాబాయి గుండెపోటులాంటి డ్రామాలు ఎన్ని చూడలేదు జనం అంటూ మరొకరు కామెంట్ చేశారు. బాబాయిని చంపినట్టు ఈవిడని కూడా చంపి ఎదుటోళ్ళు చేసారని చెప్పటం మీకు అలవాటుగా, కొత్త ఏముంది వైసీపీ పేటీఎమ్స్? అని ఇంకొకరు కామెంట్ చేశారు. 


Tags:    

Similar News