నవరత్నాలు దమ్ముంటే ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. షర్మిల సవాల్
ఏపీలో కాంగ్రెస్ అద్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాద్యతలు చేపట్టినప్పటి నుండి రాష్ట్రమంతా పర్యటిస్తూ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో కాంగ్రెస్ అద్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాద్యతలు చేపట్టినప్పటి నుండి రాష్ట్రమంతా పర్యటిస్తూ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై వైసీపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇటీవలే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దానిపై వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. మహనేత వైఎస్ఆర్ 52 వేల పోస్టులతో డీఎస్సీ వేస్తే.. వారసుడుగా చెప్పుకునే జగన్ అన్న 6 వేల పోస్టులతో దగా డీఎస్సీ వేశారని, ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైసీపీ నాయకులు, వీళ్లను మోసే సోషల్ మీడియాకు ఒక సవాల్ అంటూ రాసుకొచ్చారు.
1. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ ?
2. 5 ఏళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు ?
3. ఎన్నికలకు నెలన్నర ముందు 6 వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి ?
4. టెట్,డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి ?
5. నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా? టెట్ కి 20 రోజులు, తర్వాత డీఎస్సీ మద్య కేవలం 6 రోజుల వ్యవధి నా ?
6. YSR హయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్ కి గుర్తులేదా ?
7. ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా ?
8. రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా ?
9. మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా ? ఇది కక్ష్య సాధింపు చర్య కాదా?
నవ రత్నాలు, జాతి రత్నాలు అని చెప్పుకొనే జగన్ అన్న, ఆయన చుట్టూ ఉండే సకలం శాఖ మంత్రులు ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలి అని ట్వట్టర్ వేదికగా సవాల్ విసిరారు.
Read More..
చెల్లి కాదు చంద్రముఖీ.. సోదరిపై సొంత అన్ననే విమర్శలు చేయిస్తున్నారా..?