స్కిల్ డవలప్మెంట్‌లో స్కాంకు చోటేలేదు: చంద్రబాబు తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌‌పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

Update: 2023-09-19 08:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌‌పై ఏపీ హైకోర్టులో వాదనలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో సీఐడీ చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. దీంతో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజులపాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఏసీబీ కోర్టు జారీచేసిన జ్యూడిషియల్ రిమాండ్ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణను ఈనెల 19కు వాయిదా వేసింది. దీంతో మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది హరీష్ సాల్వే వర్చువల్‌గా వాదనలు వినిపించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చట్ట విరుద్దమని హరీష్ సాల్వే అన్నారు. ‘సీమెన్స్ ఇచ్చిన ప్రాజెక్టు కాస్ట్ సరైందని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది. 6 సెంటర్ల కోసం డబ్బులు చెల్లించారు. 6 సెంటర్లను తయారు చేసి అప్పగించారు. ఇంకెక్కడి అవినీతి జరిగింది. ప్రాజెక్టు కాస్ట్ రూ.150 కోట్లు ఎక్కువ చేసి చూపించారనేది అవాస్తవం. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రేట్ల ప్రకారమే అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎక్కడికి పారిపోడు. సాక్షుల్ని చంద్రబాబు ప్రభావితం చేయడు. అల్రెడి మొత్తం విచారణ పూర్తి చేశాకే అరెస్ట్ చేశారు. కాబట్టి చంద్రబాబును విడుదల చేయాలి’ అని చంద్రబాబు తరపు న్యాయవాది హారీష్ సాల్వే వాదనలు వినిపించారు. చంద్రబాబు నాయుడు అరెస్టుపై గవర్నర్ అనుమతి తీసుకోలేదు అని హరీష్ సాల్వే వాదించారు. అవినీతి నిరోధక చట్టంలో తీసుకువచ్చిన సవరణల ప్రకారం ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలి అని అన్నారు. దీనికి సంబంధించి అనేక తీర్పులు హరీష్ సాల్వే ఉదహరించారు. 2021లో నమోదైన ఎఫ్ఐఆర్‌తో ఇప్పుడు చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారు? అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసే సమయానికి ఎఫ్ఐఆర్‌లో అసలు చంద్రబాబు పేరు లేదు అని చెప్పుకొచ్చారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాతే అరెస్ట్ చేయాలి అని హరీష్ సాల్వే వాదించారు. చంద్రబాబు విషయంలో సీఐడీ ప్రొసీజర్ పాటించలేదు అని హరీష్ సాల్వే వాదించారు. మరోవైపు సీఐడీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న  

Read More..

Chandrababu Naidu : ఏసీబీ కోర్టులో మూడు పిటిషన్ల విచారణ : లంచ్ తర్వాత నిర్ణయం  

Tags:    

Similar News