Ap News: చంద్రబాబుకు మరో తలనొప్పి!
"వైసీపీ కోవర్టు డ్రామా స్టార్ట్అయినట్లుంది. ఇది రాబోయే వ్యూహానికి సినిమా స్క్రిప్ట్అనుకుంటా. జర జాగ్రత్త తెలుగు తమ్ముళ్లు !" అంటూ టీడీపీ సీనియర్‌నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్‌చేశారు. ...
- వైసీపీవి కోవర్టు రాజకీయాలా!
- అసమ్మతి నేతలను టీడీపీ ఆహ్వానిస్తుందా ?
- అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటుందా !
- తమ్ముళ్లలో గుబులు రేకెత్తిస్తోన్న బుచ్చయ్య చౌదరి ట్వీట్
దిశ, ఏపీ బ్యూరో: "వైసీపీ కోవర్టు డ్రామా స్టార్ట్అయినట్లుంది. ఇది రాబోయే వ్యూహానికి సినిమా స్క్రిప్ట్అనుకుంటా. జర జాగ్రత్త తెలుగు తమ్ముళ్లు !" అంటూ టీడీపీ సీనియర్‌నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్‌చేశారు. నెల్లూరు జిల్లా వైసీపీలో ముసలం గురించే ఆయన ట్వీట్చేసినట్లు కనిపిస్తోంది. టీడీపీ అవకాశమిస్తే పోటీ చేస్తానని రూరల్ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించడంపై బుచ్చయ్య చౌదరి ఇలా ట్విట్టర్వేదికగా స్పందించినట్లు టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
వైసీపీలో అసమ్మతి నేతలు పచ్చ కండువా వేసుకోవడానికి సిద్ధమైతే టీడీపీ ఆహ్వానిస్తుందా లేదా అనేది తమ్ముళ్లలో గుబులు రేకెత్తిస్తోంది. వలస వచ్చిన నేతలతో ఎవరి సీటు గల్లంతు అవుతుందోనన్న ఆందోళన నెలకొంది. బుచ్చయ్య చౌదరి భావిస్తున్నట్లు ఇది నిజంగా వైసీపీ కోవర్టు రాజకీయమా అనేది కూడా టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.
మొత్తం 175 స్థానాల్లో సుమారు 40 నుంచి 50 సీట్లలో టీడీపీ బలహీనంగా ఉన్నట్లు చంద్రబాబు స్వయంగా చేయించుకున్న సర్వేలో గుర్తించినట్లు పార్టీ వర్గాలకు తెలుసు. ఆయా సీట్లలో బలమైన అభ్యర్థి దొరికితే ఇన్‌చార్జులను మార్చి వేయడానికి చంద్రబాబు వెనుకాడరు. బలహీనమైన స్థానాల పరిధిలో వైసీపీ నుంచి వచ్చే నేత ధీటైన అభ్యర్థి అనుకుంటే పచ్చ కండువా కప్పడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లా నుంచి టీడీపీ బోణీ కొట్టలేదు. ఇప్పుడు నెల్లూరు రూరల్ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తాను టీడీపీ అవకాశమిస్తే పోటీ చేస్తానని ప్రకటించారు. ముందస్తుగా చంద్రబాబు నాయుడుతో కోటంరెడ్డి మాట్లాడుకునే పార్టీపై ఫోన్ట్యాపింగ్ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ చంద్రబాబుతో సీటు గురించి సంప్రదించకుండా అలా వ్యాఖ్యానించి ఉంటే టీడీపీ వర్గాలు స్పందించాలి. స్వాగతించడమో లేక తమతో సంప్రదించలేదనో చెప్పాలి. మౌనం దేనికి సంకేతమో తెలీదు. ఈలోగా బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్దెబ్బకు టీడీపీ వర్గాలు ఆలోచనలో పడ్డాయి. ఇక ఆనం రామనారాయణ రెడ్డి కూతురు టీడీపీ మహానాడులోనే నారా లోకేష్‌తో సంప్రదించి బెర్త్ఖాయం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తానంటే టీడీపీ కాదనకపోవచ్చు. ఈసారి ఎలాగైనా నెల్లూరు జిల్లాలో సగం సీట్లు గెలవాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. ఇలాంటి తరుణంలో అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటారా! లేక బుచ్చయ్య చౌదరి ట్విట్టర్‌ద్వారా వెలిబుచ్చిన అనుమానంతో వెనకడుగు వేస్తారా అనేది పార్టీ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
కేవలం నెల్లూరు జిల్లానే కాదు. టీడీపీ బలహీనంగా ఉన్నచోట్ల బలమైన అభ్యర్థుల కోసం వెదుకుతోంది. గత ఎన్నికల్లో తమకన్నా పదిశాతానికి పైగా ఓట్లు తెచ్చుకున్న వైసీపీ నుంచి బలమైన అభ్యర్థి దొరికితే పార్టీలోకి తీసుకోవచ్చు. అక్కడ నుంచి There is no chance of Chandrababu getting another headache. ఇప్పటిదాకా పార్టీని నమ్ముకొని తనదే సీటు అనే భావనతో పని చేస్తున్న వాళ్లకు ఆశాభంగం తప్పదు. వాళ్లను నయానో భయానో బుజ్జగించాల్సి వస్తుంది. వైసీపీ నుంచి వచ్చిన నాయకుడితో పని చేయాల్సి వచ్చినప్పుడు క్యాడర్సహకరిస్తుందా లేదా అనేది కూడా పెద్ద సమస్యే. బుచ్చయ్య చౌదరే కాదు. ఎవరేమన్నా అవసరమైన చోట వైసీపీ నుంచి బలమైన అభ్యర్థి దొరికితే చంద్రబాబు వదులుకోరని పార్టీలో కొందరు నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లానే. ఇంకా రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ అసమ్మతి నేతలకు చంద్రబాబు గ్రీన్సిగ్నల్ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వరుస పరిణామాలపై ఇప్పటిదాకా చంద్రబాబు స్పందించకపోవడం వెనుక కారణం ఏమై ఉంటుందనేది తమ్ముళ్లల్లో చర్చనీయాంశమైంది.