ఏపీలో మహిళలే ఎక్కువ... అత్యధిక మహిళలున్న రాష్ట్రాల్లో ఆరో స్థానం

దేశంలో అత్యధిక మహిళలున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆరో స్థానంలో నిలిచింది.

Update: 2023-10-13 12:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో అత్యధిక మహిళలున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆరో స్థానంలో నిలిచింది. ఈ మేరకు లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు మహిళలు 1,030 మంది ఉన్నారు అని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ స్త్రీ, పురుష నిష్పత్తిలో మహిళలే అత్యధికంగా ఉన్నట్లు నివేదికలో తేటతెల్లమైంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమా­ల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లేబర్‌ ఫోర్స్‌ సర్వే నివేదికను చూస్తే 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళల సంఖ్య అత్యధికంగా ఉంది. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల సంఖ్యే ఎక్కువ. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో ప్రతి 1,000 మంది పురుషులకు 1,030 మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 1,017 మంది స్త్రీలు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 1,035 మంది స్త్రీలు ఉన్నారు అని లేబర్ ఫోర్స్ సర్వే స్పష్టం చేసింది.

Tags:    

Similar News