VIZAG : వైసీపీ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్ : రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇవాళ ఆయన విశాఖలో మీడియాతో మాట్లడుతూ.. వైసీపీ మునిగిపోతున్న నావ లాంటిదని, అందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. తనను కలిసేందుకు వచ్చిన సిట్టింగ్ ఎంపీలకు జగన్ అవకాశం ఇవ్వకపోవడం దారుణమని పేర్కొ్న్నారు. పెనమలూరు ఎమ్మెల్యే, కర్నూలు ఎమ్మెల్యేలు జగన్ వైఖరి నచ్చక ఇప్పటికే ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారని తెలిపారు.
ఇటీవలే భారత ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు జగన్ నమ్మి వైసీపీలో చేరారని.. పార్టీ గురించి అర్థం అయ్యాక ఆయన వెంటనే రాజీనామ చేశారని గుర్తు చేశారు. తన రాజకీయ జీవితంలో ఇంత పెద్ద ఎత్తున ఏ పార్టీ అభ్యర్థులను మార్చలేదని అన్నారు. ఈ నెల 20న భీమిలి నుంచి జగన్ ప్రజాయాత్రలు ప్రారంభిస్తారని తెలిసిందిని, ఇకన ఆయనకు ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని జోస్యం చెప్పారు. ఉమ్మడి విశాఖలో ఒక్క స్థానంలోనూ వైసీపీ గెలిచే అవకాశమే లేదుని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.