గుండె నొప్పి వస్తోంది.. ఇండియా తీసుకెళ్లండి.. ఖతార్‌లో కోనసీమ మహిళ తీవ్ర ఆవేదన

ఖతార్‌లో కొనసీమ జిల్లాకు చెందిన మహిళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు...

Update: 2024-09-21 12:20 GMT

దిశ, వెబ్ డెస్క్: ఖతార్‌(Qatar)లో కొనసీమ జిల్లాకు చెందిన మహిళ (Konaseema district women) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోసమని రాయవరం మండలానికి చెందిన ఆమె .. ఓ ఏజెంట్ ద్వారా ఖతార్ వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఏజెంట్ చేతిలో మోసపోయారు. ఇండియాలో చెప్పినట్లు కాకుండా కొందరు వ్యక్తుల వద్ద ఆమెను పనిలో చేర్చారు. అయితే ఆమెతో విశ్రాంతి లేకుండా పని చేయిస్తున్నారు. కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టడంలేదు. ఇలా చాలా ఇబ్బందులు పడిన మహిళకు ఇటీవల కాలంలో గుండె నొప్పి వచ్చింది. అయితే యజమానులు ఏమాత్రం స్పందించలేదు. ఆస్పత్రికి సైతం తీసుకెళ్లలేదు. దీంతో బాధితురాలి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

తనని ఎలాగైనా ఇండియాకు తీసుకెళ్లాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy Cm Pawan Kalyan), మంత్రులు నారా లోకేష్ (Minister Nara Lokesh), సుభాశ్‌(Minister Subash)ను వేడుకుంటూ బాధితురాలు వీడియో విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కోనసీమ మహిళలను ఇండియాకు రప్పించాలని నెటిజన్లు సైతం కోరుతున్నారు. వీడియోను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, సుభాశ్‌లకు ట్యాగ్ చేస్తున్నారు. త్వరగా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


Similar News